Breaking News

ప్రదీప్‌ రంగనాథన్‌తో టాప్‌ బ్యానర్‌లో సినిమా.. ముగ్గురు హీరోయిన్లకు ఓకే

Published on Fri, 03/14/2025 - 07:17

కోలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న యువ కథానాయకుడు ప్రదీప్‌ రంగనాథన్‌. ఈయన కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విజయం సాధించాయి. అందులో రెండు చిత్రాలకు ప్రదీప్‌ రంగనాథన్‌నే దర్శకుడు కావడం విశేషం. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్‌. బక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది. అశ్వద్‌ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా నటించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై రూ. 150కోట్ల వరకు రాబట్టింది . 

కాగా ప్రస్తుతం నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో 'ఎల్‌కే' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తదుపరి ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న భారీ చిత్రంలో ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఆ ప్రచారం. 

మహిళా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలిసింది. కాగా ఇందులో ప్రేమలు చిత్రం ఫేమ్‌ మమిత బైజూ నాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటి అనూ ఇమాన్యుల్, సీరియల్‌ నటి ఐశ్వర్య శర్మ కూడా కథానాయికలుగా నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)