Breaking News

లవ్‌ టుడే.. వంద రోజుల్లో వందకోట్లు.. చాలామంది ఎగతాళి చేశారు

Published on Thu, 02/16/2023 - 09:06

ప్రస్తుత కాలంలో సినిమాలు ఒక్క వారం థియేటర్లలో ఆడటమే గగనంగా మారింది. అలాంటిది శతదినోత్సవ వేడుకలు సాధ్యమా? అంటే లవ్‌ టుడే అనే చిన్న చిత్రం సాధ్యమే అని నిరూపించింది. ఏజీఎస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. నటి ఇవాని హీరోయిన్‌గా నటించగా సత్యరాజ్, నటి రాధికాశరత్‌కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించారు. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ నవంబర్‌ 4వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసి ఘన విజయాన్ని సాధించింది. దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్ర శత దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి చెన్నై చెట్‌పెట్‌లోని లేడీ ఆండాళ్‌ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై చిత్ర దర్శక, కథానాయకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ మాట్లాడుతూ.. లవ్‌ టుడే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు సాధించిందన్నారు. తాను కథానాయకుడిగా నటించిన ఈ సినిమా చతికిలబడితే మళ్లీ పైకి లేవడం కష్టం అని చాలా మంది ఎగతాళి చేశారన్నారు. మరికొందరేమో ఇది ఒక కొండలాంటిదని అన్నారన్నారు. అయితే తాను ఆలోచించింది ఏమిటంటే కొండ ఎక్కడం కష్టమా? అందుకు ఏం చేయాలి? తగిన పరికరాలు, శిక్షణ, శారీరక బలం, ఆక్సిజన్‌ వంటివి ఉండాలి కదా. అసలు ఎక్కడానికి ఆ కొండ కావాలి కదా.. అదే లవ్‌ టుడే చిత్రం అన్నారు. తనపై నమ్మకంతో అవకాశాన్ని కల్పించిన చిత్ర నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు.

చదవండి: రెండుసార్లు బ్రేకప్‌.. అది బ్లాక్‌డే అంటున్న బ్యూటీ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)