Breaking News

దీపావళి బరిలో డ్రాగన్‌ హీరో.. మరో హిట్ కొడతాడా?

Published on Sun, 08/24/2025 - 07:06

లవ్‌టుడే, డ్రాగన్‌ చిత్రాల విజయంతో క్రేజీ స్టార్‌గా ఎదిగిన కోలీవుడ్ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌. తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ఎల్‌ఐకే (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ) ఒకటి. సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్తారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నటి నయనతార నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, యోగిబాబు, గౌరీకిషన్‌, షారా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో సీమాన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇందులోని తీమా తీమా అనే పల్లవితో సాగే తొలి పాటను ఇటీవల విడుదల చేయగా విశేష ఆదరణ పొందింది. చిత్రం ఆడియోను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపారు. అలాగే ఎల్‌ఐకే చిత్రాన్ని దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్‌ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా ప్రదీప్‌ రంగనాథన్‌, విఘ్నేశ్‌ శివన్‌, అనిరుధ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)