Breaking News

పెట్టరాప్‌ సాంగ్‌.. ఇదే టైటిల్‌తో ప్రభుదేవా కొత్త సినిమా!

Published on Fri, 06/02/2023 - 17:47

కాదలన్‌ చిత్రంలో పెట్టరాప్‌ అనే పల్లవితో సాగే పాట ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఆ పాటలో నటుడు ప్రభుదేవా, వడివేలు నటించారు. కాగా అదే టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు. దీనికి 'పాట్టు అడి.. ఆట్టం.. రిపీట్‌' అనే ట్యాగ్‌ను పెట్టారు. ఇందులో వేదిక హీరోయిన్‌గా నటించనున్నారు. చాలా గ్యాప్‌ తరువాత ఈమె తమిళంలో నటిస్తున్న చిత్రమిది.

ఇతర ముఖ్యపాత్రల్లో వివేక్‌ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేశ్‌ తిలక్, రాజీవ్‌ పిళ్‌లై, కళాభవన్‌ షాజన్, మైమ్‌ గోపీ, రియాజ్‌ఖాన్‌ నటించనున్నారు. మలయాళ దర్శకుడు ఎస్‌జే.శీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బ్లూహిల్స్‌ ఫిలింస్‌ పతాకంపై జోబీ పి.శ్యామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురువారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. దీని గురించి దర్శకుడు తెలుపుతూ ఇది రొమాన్స్‌ కామెడీ,యాక్షన్‌ థ్రిల్లర్, మ్యూజికల్‌ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.

చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌ 15వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను పుదుచ్చేరి, చెన్నైలో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. కాగా దీనికి డి.ఇమాన్‌ సంగీతాన్ని, జిత్తు దామోదరన్‌ చాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు.

చదవండి: గ్రాండ్‌గా మొదలైన శర్వానంద్‌ పెళ్లి వేడుకలు

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)