Breaking News

అవును, నేను తండ్రినయ్యా, ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా

Published on Mon, 06/12/2023 - 15:11

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా తండ్రయ్యాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అతడి రెండో భార్య హిమానీ తొలిసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందన్నది సదరు వార్తల సారాంశం. తాజాగా ఈ వార్తలపై ప్రభుదేవా స్పందించాడు. లేటు వయసులో మరోసారి తండ్రి అయ్యానని వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అవును, నా గురించి వస్తున్న వార్తలు నిజమే! 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యాను. చాలా సంతోషంగా ఉంది. నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది.

ఇప్పటికే నేను క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నాను. ఒకరకంగా చెప్పాలంటే పరిగెడుతున్నాను. అందుకే పనిభారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటిదాకా చేసింది చాలు.. ఇప్పుడు నా కుటుంబంతో కొంత సమయం గడపాలనుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రభుదేవా గతంలో  రమాలత్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఇందులో ఒక అబ్బాయి చిన్న వయసులో మరణించాడు.

ఆ తర్వాత కొంతకాలానికి ప్రభుదేవా,  రమాలత్ ల మధ్య పొరపచ్చాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తాము విడిపోవడానికి హీరోయిన్‌ నయనతారే కారణమని ఆ మధ్య  రమాలత్  మీడియా ముఖంగానే వెల్లడించింది. అనంతరం ప్రభుదేవా 2020లో ఫిజియోథెరపిస్ట్‌ హిమానీ సింగ్‌ను పెళ్లాడాడు. తాజాగా ఆమె పండంటి పాపాయికి జన్మనిచ్చింది.

చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికి హాజరైన హీరోయిన్‌

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)