ట్రైలర్‌ రెడీ

Published on Fri, 09/26/2025 - 03:20

ఫ్యాన్స్‌కు దసరా ట్రీట్‌ రెడీ చేస్తున్నారు హీరో ప్రభాస్‌. ఫ్యాంటసీ అండ్‌ హారర్‌ కామెడీ జానర్‌లో ప్రభాస్‌ నటిస్తున్న తొలి చిత్రం ‘ది రాజాసాబ్‌’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధీ కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్‌ దత్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్‌లో ప్రభాస్‌ పరిచయ పాట చిత్రీకరణ జరిగింది.

కాగా, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ గ్రీస్‌ దేశంలో జరుగుతుందని, అక్కడ ప్రభాస్‌తో పాటు లీడ్‌ హీరోయిన్స్‌ పాల్గొనగా కొన్ని పాటల చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ఇటీవలే ఈ చిత్రదర్శకుడు మారుతి అక్కడి లొకేషన్స్‌ను పరిశీలించి వచ్చారు. ఇక ఈ దసరా పండక్కి, ‘ది రాజాసాబ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల కానుందని తెలిసింది.

ఈ ట్రైలర్‌ సెన్సార్‌ పనులు కూడా పూర్తయ్యాయని, నిడివి మూడు నిమిషాలకు పైనే ఉంటుందని సమాచారం. ఇలా ఈ దసరా పండక్కి ఫ్యాన్స్‌కి విజువల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు ప్రభాస్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్‌.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)