బ్రిటిష్‌ సైనికుడిగా ప్రభాస్‌!

Published on Sun, 07/14/2024 - 01:13

సైనికుడిగా కనిపించనున్నారట ప్రభాస్‌. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు మొదట్లో ప్రారంభించాలనుకుంటున్నారని తెలిసింది. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమా కథనం భారతదేశ స్వాతంత్య్రం పూర్వానికి ముందు జరుగుతుందని, బ్రిటిష్‌ సైన్యంలో పని చేసే సైనికుడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

ఈ పాత్ర కోసం ప్రభాస్‌ స్పెషల్‌గా మేకోవర్‌ కానున్నారట. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్‌ హీరోగా అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)