Breaking News

ఓటీటీలో కల్కి.. రన్‌టైమ్‌ ఎన్ని నిమిషాలు తగ్గించారంటే?

Published on Thu, 08/22/2024 - 17:05

ప్రభాస్- నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో కల్కి ఓటీటీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా రిలీజై 50 రోజులు పూర్తి కావడంతో ఓటీటీకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆగస్టు 22 నుంచి అమెజాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 
అయితే ఓటీటీలో కల్కి నిడివిపై నెట్టింట చర్చ మొదలైంది. థియేటర్లలో ప్రదర్శించిన రన్‌టైమ్‌ కంటే తక్కువ ఉండడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. థియేటర్లలో 181 నిమిషాలు ఉన్న కల్కి.. ఓటీటీకి వచ్చేసరికి 175 నిమిషాలకే కుదించారు. దీంతో ఈ మూవీలో ఏ సీన్లను తొలగించారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ట్రిమ్‌ చేసిన సీన్స్‌ ఇవే..

కల్కిలో  కొన్ని సీన్లను ట్రిమ్ చేయడంతో ఏకంగా ఆరు నిమిషాల రన్‌టైమ్‌ తగ్గిపోయింది. ఆ సీన్లలో మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్.. నిడివి కాస్త ఎక్కువగా అనిపించడంతో తొలగించారు. ఇందులో ప్రభాస్‌ను కప్ప అని పిలిచే సీన్ కూడా తీసేశారు. ఆ తర్వాత ప్రభాస్‌ ఇద్దరు భారీ కాయులతో చేసే ఫైట్ సీన్ నిడివిని కూడా తగ్గించారు. ఇక కాంప్లెక్స్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడ దిశా పటానీతో ప్రభాస్ సాంగ్‌ను కూడా కట్‌ చేశారు.

అంతేకాకుండా బీచ్ సీన్లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. మెరూన్ దుస్తులలో ప్రభాస్‌తో మొత్తం సీక్వెన్స్ ఎత్తేశారు. ఇంటర్వెల్‌కు ముందు దీపికా మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్‌ను ట్రిమ్ చేయడంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్‌ తొలగించారు. అక్కడ థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్‌ జోడించారు. ఇకపోతే డబ్బింగ్‌లోనూ అక్కడక్కడా మార్పులు చేశారు.

కారణమిదేనా?

కల్కి 2898 ఏడీ జూన్ 27న రిలీజ్‌ నాటిటి 181 నిమిషాల నిడివి ఉంది. అంటే 3 గంటల ఒక నిమిషంతో థియేటర్లలో రిలీజైంది. నిజానికి ఇది చాలా ఎక్కువ రన్ టైమ్. ఆ సమయంలో సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ వచ్చినా.. రన్‌టైమ్‌ విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే ఓటీటీలోకి వచ్చేసరికి మేకర్స్ ఏకంగా 6 నిమిషాలను తగ్గించేసినట్లు తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)