Breaking News

అందుకే మా వేవ్‌ లెంగ్త్‌ కుదిరింది

Published on Fri, 07/18/2025 - 00:13

ఒకే బేనర్‌లో ఒక స్టార్‌ హీరో మూడు సినిమాలు చేయడానికి అంగీకరించడం అంటే అది పెద్ద విషయమే. ఆ బేనర్‌ అధినేతతో వేవ్‌ లెంగ్త్‌ కుదిరితేనే ఇలా ‘త్రీ ఫిల్మ్‌ డీల్‌’ ఓకే అవుతుంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే’లో ప్రభాస్‌ మూడు సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ హీరోతో ‘సలార్‌: 1 సీజ్‌ఫైర్‌’ చిత్రంతో ఈ సంస్థ అనుబంధం ఆరంభమైంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సలార్‌: 2 శౌర్యాంగపర్వం’ రావాల్సి ఉంది. ఈ రెండో భాగంతో పాటు మరో రెండు చిత్రాలు ఈ సంస్థలో చేయనున్నారు ప్రభాస్‌.

ఇలా ఒకే బేనర్‌లో మూడు చిత్రాలు చేయాలనుకున్న నిర్ణయం గురించి ప్రభాస్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘హోంబలే సంస్థ అధినేత విజయ్‌ కిరగందూర్‌తో ‘సలార్‌’తో నా జర్నీ మొదలైంది. సెట్స్‌లో ఆయన అందర్నీ బాగా చూసుకుంటారు. అందరి గురించి ఆయన తీసుకునే కేర్‌ చూసి, నేను విజయ్‌తో సినిమాలు చేయాలనుకున్నాను. మా మధ్య ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉండేలాంటి అనుబంధం పెరిగింది. ఒక ఇంటి మనిషితో ఉన్నట్లే నాకనిపిస్తుంటుంది. అలాగే నేను, తను ఒక విషయంలో సేమ్‌.

అదేంటంటే... నాలానే తను కూడా తన చైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్స్‌కిప్రాధాన్యం ఇస్తారు. నాలానే బయట ఎవర్నీ కలవడానికి పెద్దగా ఇష్టపడరు. ఇలాంటి కొన్ని లక్షణాల వల్ల మా వేవ్‌ లెంగ్త్‌ కుదిరింది. ఇక నిర్మాతగా క్వాలిటీ విషయంలో రాజీపడరు. ఒకసారి ‘కేజీఎఫ్‌’ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగితే... అందరూ టెన్షన్‌ పడిపోయారట. కానీ విజయ్‌ కూల్‌ డౌన్‌ చేసి, ‘బడ్జెట్‌ గురించి ఏం బాధపడొద్దు. రాజీపడకుండా సినిమా చేద్దాం’ అన్నారని విన్నాను. అలాగే తను నిర్మించిన ‘కాంతార’, ఇతర సినిమా యూనిట్స్‌ నుంచి కూడా నేనిలాంటివి విన్నాను’’ అని పేర్కొన్నారు. ఇక హోంబలేతో ప్రభాస్‌ చేయనున్న మూడు సినిమాల్లో ‘సలార్‌ 2’ ఒకటి కాగా మిగతా రెండు చిత్రాల వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)