Breaking News

డిసెంబరులో...

Published on Tue, 06/16/2026 - 00:02

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్  లవ్‌స్టోరీ మూవీ  ‘ఫౌజి’. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ సినిమా కథలో బ్రిటిష్‌ సోల్జర్‌ పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నారని తెలిసింది. ఇమాన్వి ఇస్మాయిల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, జయప్రద, భానుచందర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌  నిర్మిస్తున్నారు.

కాగా ‘ఫౌజి’ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో దసరాకు రిలీజ్‌ కావడం లేదని తెలిసింది. డిసెంబరు మొదటి వారంలో రిలీజ్‌ చేయాలని ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ ప్లాన్  చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలో దేశభక్తి అంశాలు ఉండటంతో ఆగస్టు 15కి ‘ఫౌజి’ టీజర్‌ను రిలీజ్‌ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉందట.

మరి.. ‘ఫౌజి’ డిసెంబరులోనే  థియేటర్స్‌కు వస్తుందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ప్రభాస్‌ ప్రస్తుతం ‘స్పిరిట్‌’ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్నారని తెలిసింది. త్వరలోనే నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్ లో ‘కల్కి 2’ చిత్రీకరణలో పాల్గొంటారు. ‘స్పిరిట్‌’ సినిమా 2027 మార్చి 5న రిలీజ్‌ కానుంది. ‘కల్కి 2’ రిలీజ్‌ డేట్‌పై స్పష్టత రావడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)