Breaking News

ప్రభాస్ 'ఆదిపురుష్'.. డైరెక్టర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం!

Published on Sun, 03/26/2023 - 13:35

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మైథలాజికల్‌ డ్రామా ‘ఆదిపురుష్‌’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషిస్తున్నారు.  బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్‌ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్‌ 16న రిలీజ్‌ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. 

కానీ ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఆదిపురుష్ రిలీజ్‌కు ముందు అప్‌ డేట్స్ ఇస్తే ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి దాదాపు ఏడాదికి పూర్తవుతున్న  అప్ డేట్స్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఉగాదికి కూడా ఆదిపురుష్ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. పలువురు అగ్రహీరోల సినిమాల నుంచి అప్‌ డేట్స్ వచ్చినా కూడా ఆదిపురుష్ వెనకపడిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. 

రామాయణం ఇతిహాసం కావడంతో ఈనెల 30న శ్రీరామనవమి సందర్భంగానైనా అప్‌డేట్ ఇస్తారా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ విషయంలో డైరెక్టర్ ఓం రౌత్ సీరియస్‌గా లేరని మరికొందరు ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరి అభిమానులను దృష్టిలో ఉంచుకొని త్వరలో ఏమైనా అప్ డేట్‌ ఇస్తారా? లేక ఎప్పటిలాగే ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవుతారా అన్నది వేచి చూడాల్సిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)