Breaking News

ప్రభాస్‌ బర్త్‌డే గిఫ్ట్‌.. ఫస్ట్‌ సినిమా రీ-రిలీజ్‌

Published on Tue, 08/20/2024 - 13:37

'ఈశ్వర్‌'తో గల్లీకుర్రాడి పాత్రలో తొలిసారి వెండితెరపై మెరిశాడు ప్రభాస్‌. అక్కడ ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఇప్పుడు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా ఎంటో చూపిస్తున్నాడు. 2002లో విడుదలైన ఈశ్వర్‌ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్‌ కానుంది. దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కోళ్ళ అశోక్ కుమార్ రూ. 50 లక్షల బడ్జెట్‌తో నిర్మిస్తే.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 5.3 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఈశ్వర్‌ మళ్లీ వస్తున్నాడు.

అక్టోబర్ 23, 2024న ప్రభాస్ తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఆయన నటించిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇండస్ట్రీలో వస్తున్న నివేదికల ప్రకారం. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన తొలి చిత్రం ఈశ్వర్ రీ-రిలీజ్‌ చేయనున్నారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈశ్వర్‌ సినిమాతో పాటు డార్లింగ్ కూడా అదేరోజు మళ్లీ విడుదల కానుంది.

జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో  యాక్షన్ డ్రామాగా ఈశ్వర్‌ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, ధీరజ్ కృష్ణ నోరి, రేవతి, రవికాంత్, హనుమంతు, ఎన్. హరి కృష్ణ, బ్రహ్మానందం వంటి నటీనటులు నటించారు. ఒక ఎమ్మెల్యే కూతురిని పేదింటి కుర్రాడు ప్రేమిస్తే వచ్చే చిక్కులు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు. ఇందులో ధూల్‌పేట్‌ ఈశ్వర్‌గా ప్రభాస్‌ తన మాస్‌ హీరోయిజం చూపించాడు. శ్రీదేవి విజయ్‌కుమార్ కూడా ఇందులో సరైన జోడిగా మెప్పించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం. 

'అమీర్‌పేటకు ధూల్‌పేటకు' అనే పాట అందరికీ ఫేవరెట్‌ అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత రాఘవేంద్రతో పర్వాలేదనిపించిన ప్రభాస్‌.. ఆ వెంటనే 'వర్షం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక్కడి నుంచి ఆయన గ్రాఫ్‌ భారీగా పెరిగింది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)