Breaking News

నెగటివ్‌ షేడ్స్‌లో ప్రభాస్‌.. ప్రశాంత్‌ వర్మ భారీ ప్లాన్‌!

Published on Sun, 11/03/2024 - 17:53

ప్రభాస్‌ ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్‌. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేయాల్సిన ‘స్పిరిట్‌’ సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 

(చదవండి: ఆ కారణంతో దిల్‌ రాజు సినిమాను రిజెక్ట్‌ చేశా: దుల్కర్‌ సల్మాన్‌)

అయితే ప్రభాస్‌ తర్వాతి చిత్రాలపై ఫిల్మ్‌నగర్‌లో కొత్త విషయాలు వినిపిస్తున్నాయి. ‘హను–మాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమాను ప్రభాస్‌ చేస్తారని, అలాగే తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో ఓ కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు... బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌ హిరాణీ కూడా ప్రభాస్‌తో ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని బాలీవుడ్‌ టాక్‌.

(చదవండి: ఎన్టీఆర్‌ బావ మరిది 'నార్నే నితిన్‌' నిశ్చితార్థం)

 మరి... ‘రాజాసాబ్, ఫౌజి, స్పిరిట్‌’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ తర్వాతి చిత్రం ఎవరి డైరెక్షన్‌లో ఉంటుంది? అనే విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘బ్రహ్మరాక్షస’ సినిమాలో ప్రభాస్‌ పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయట. ఇక ఈ సినిమాను రణ్‌వీర్‌ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్‌ వర్మ. కొన్ని కారణాల వల్ల ప్లాన్‌ మార్చి, ప్రభాస్‌తో చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)