Breaking News

Prabhas Movie: పారితోషికమే రూ.200 కోట్లా?!

Published on Sun, 05/30/2021 - 15:07

ప్రేక్షకుడి టేస్ట్‌ మారింది, సినిమాలు తీసే విధానమూ మారింది. కేవలం ఒక భాషలో కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు తీయడం ప్యాషన్‌ అయిపోయింది. మరి జాతీయ లెవల్లో తీసే సినిమాలకు ఓకే చెప్పే హీరోలు తక్కువ పారితోషికం తీసుకుని అడ్జస్ట్‌ అయిపోతారా? ఛాన్సే లేదు! తమకు కావాల్సినంత ముట్టజెప్పాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక స్టార్‌ హీరోలతో సినిమా అంటే కాసుల వర్షం కురవడం ఖాయం కాబట్టి నిర్మాతలు కూడా డబ్బులకు వెనకాడట్లేదు. హీరో సంతృప్తి చెందేలా, సినిమా క్వాలిటీగా వచ్చేలా కావాల్సినంత ఖర్చు పెడుతున్నారు.

ఇదిలా వుంటే ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పూర్తి బడ్జెట్‌ ఎన్ని కోట్లవుతుందో తెలీదుగానీ కేవలం అందులో నటిస్తున్న స్టార్లకు ఇవ్వాల్సిన రెమ్యునరేషనే రూ.200 కోట్లు ఉందట. ఫిల్మీదునియాలో లీకైన ఈ వార్త నెట్టింట గుప్పుమంటోంది. కేవలం నటీనటులకే రూ.200 కోట్లు చెల్లిస్తున్నారంటే ఇక సినిమాను ఏ రేంజ్‌లో తీస్తారోనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో మెజారిటీ వాటా ప్రభాస్‌దేనన్న విషయం తెలిసిందే. డార్లింగ్‌ హీరో ప్రభాస్‌ ఒక్కడే రూ.100 కోట్లు తీసుకుంటున్నాడని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి.

ఇక ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. అలాగే మరో ఏడెనిమిది మంది బాలీవుడ్‌ నటులను కూడా సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమా షూటింగ్‌ను జూలైలో ప్రారంభించాలనుకున్నప్పటికీ కోవిడ్‌ కారణంగా చిత్రీకరణను అక్టోబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’,‘ఆదిపురుష్‌’,‘సలార్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

చదవండి: ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ సినిమా మొదలయ్యేది అప్పుడే!

ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ కొత్త మూవీ, టైటిల్‌ ఖరారు

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)