Breaking News

టాలీవుడ్‌లో నెం1 గ్లోబల్‌ స్టార్‌ ఎవరు?

Published on Sat, 06/28/2025 - 10:35

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ల స్టార్‌  ఫైట్‌... ఇప్పుడు గ్లోబల్‌  ఫైట్‌గా మారింది. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ హీరోలు రాణిస్తుండడం, అయితే ఒకరి తర్వాత ఒకరు రికార్డ్స్‌ బద్దలు కొట్టడంతో... వీరిలో ఎవరు నెం1 గ్లోబల్‌ స్టార్‌ అనేది ఇంకా తేలలేదు. తొలుత ప్రభాస్, తర్వాత ఎన్టీయార్, రామ్‌ చరణ్, ఆ తర్వాత అల్లు అర్జున్‌... పాన్‌ ఇండియా సినిమాల ద్వారా సత్తా చాటారు. అయితే వీరిలో ఎవరు టాప్‌ అనేది ఇంకా నిరూపణ కాలేదు. 

ఈ నేపధ్యంలో వచ్చే 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. టాలీవుడ్‌ స్టార్ల నుంచి దూసుకు వస్తున్న మూడు భారీ ప్రాజెక్టులు  ఎస్‌ఎస్‌ఎంబి29, ఎఎ22, స్పిరిట్‌... చిత్రాలు మూడూ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను లక్ష్యంగా చేసుకొని రూపొందుతున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ మూడింటిలో రాజమౌళి – మహేష్‌ బాబు కాంబోలో వస్తున్న తొలిచిత్రం ఎస్‌ఎస్‌ఎంబి29పై అత్యధికంగా అంచనాలు ఉన్నాయి.  ఎందుకంటే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా ఇప్పటికే గ్లోబల్‌  ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్నారు. తొలిసారిగా మహేష్‌ బాబు ఈ చిత్రంలో పూర్తి మేకోవర్‌తో కనిపించనున్నాడు. సమాచారం. అంతేకాక పాన్ ఇండియా సినిమా లో తన సత్తా తొలిసారి చాటనున్నాడు. 

అల్లూ అర్జున్, అట్లీ కాంబినేషన్ లో మాస్‌ అండ్‌ స్టైల్‌ ఎంటర్టైనర్‌గా ఎఎ22 చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 2వ చిత్రంగా నిలవబోతోంది. విజువల్స్, యాక్షన్,  హై ఎనర్జీ ప్రెజెంటేషన్‌ కారణంగా ఇది ఇండియన్‌ మార్కెట్‌ తో పాటు ఇంటర్నేషనల్‌ సూపర్‌ హీరో సినిమాల అభిమానులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు.

హీరోగా  ఇప్పటికే గ్లోబల్‌ స్టార్‌ డమ్‌ను స్వంతం చేసుకున్న ప్రభాస్‌...స్పిరిట్‌ కూడా రేసు లో వుంది. తన ప్రతీ సినిమా ద్వారా ప్రేక్షకులకు షాక్‌ కొట్టే కధాంశాలతో హిట్స్‌ కొట్టే  సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు, ఇప్పటికే దీపిక పదుకునే నిష్క్రమణ సందీప్ వంగా పై కామెంట్స్ తదితర వార్తల ద్వారా ఈ చిత్రం నిత్యం సినీ అభిమానుల నోట్లో నానుతోంది.ఈ చిత్రం యాక్షన్, డార్క్ థీమ్,  బోల్డ్‌ నెరేటివ్‌ తో రూపొందుతోంది. అంతర్జాతీయ నటుల ఎంపిక, గ్లోబల్‌ రిలీజ్‌ ప్లాన్‌ వంటి లతో ఇది ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ ను టార్గెట్‌ చేస్తోంది.

ఈ మూడు ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశముంది. ప్రతి చిత్రమూ దేనికదే తనదైన ప్రత్యేకతను కలిగి ఉండటంతో, ఇండియన్‌ సినిమా గ్లోబల్‌ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తదుపరి సినిమాలకు ఈ మూడూ దేనికదే ప్రత్యేక శైలి లో దిశా నిర్ధేశ్యం చేయనున్నాయి. ఆ మార్గదర్శకత్వం చేస్తున్నవారు దక్షిణాది వారు అందులోనూ ఒక్క అట్లీ తప్ప అందరూ తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణమే.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)