Breaking News

నా కెరీర్‌లోనే ఈ చిత్రానికి బెస్ట్‌ స్క్రీన్‌ప్లే ఇచ్చా : పోసాని

Published on Wed, 07/15/2026 - 11:07

‘నేను రైటర్ గా వంద చిత్రాలు రాశాను. నటుడిగా వందలాది చిత్రాల్లో నటించాను. దర్శక నిర్మాతగా సినిమాలు తెరకెక్కించాను. నేను చేసిన అన్ని చిత్రాల్లో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ కు బెస్ట్ స్క్రీన్  ప్లే ఇచ్చానని చెప్పగలను. ఈ సినిమా రూపొందించిందుకు గర్వంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు’ అని అన్నారు నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వ వహించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలతో పాటు నిర్మాతగానూ ఆయనే వ్యవహరించాడు. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. ‘మా సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్. ఆయన అందించిన సహకారం వల్లే అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేస్తున్నా.ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. ఎంతో సిన్సియర్ గా ఈ సినిమాను రూపొందించాను. "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పోసాని ఎంతో ప్లానింగ్ తో రూపొందించారు. ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ లో డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా రాసుకున్నారంటే ఆయన ఎంత పక్కాగా ఈ స్క్రిప్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కథ విన్నప్పుడే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనిపించింది. ఇది పోసాని గారికి 2.ఓ గా మారుతుందని చెప్పగలను. అన్నారు.

‘ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది’ అని హీరోయిన్ హిందోళ చక్రవర్తి అన్నారు. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ మా మూవీ గురించే మాట్లాడుకుంటారు. అలాంటి సెన్సేషన్ ను మా మూవీ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను’అని నటి కాజల్‌ శర్మ అన్నారు. నిర్మాత శ్రీనివాస్‌, డీవోపీ సుధాకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)