Breaking News

అంబానీకి కాబోయే కోడలిని అలా అనేసిందేంటి!

Published on Sat, 03/02/2024 - 15:57

అంబానీ ఇంట పెళ్లంటే ఎలా ఉండాలి? దేశమంతా మార్మోగిపోవాలి. కలకాలం చరిత్రలో నిలిచిపోయేంత ఘనంగా సెలబ్రేషన్స్‌ జరగాలి. ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్సే అందుకు సాంపుల్‌. పెళ్లికి నాలుగు నెలల ముందే హడావుడి మొదలుపెట్టేశారు. మార్చి 1 నుంచి 3 వరకు అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకుని వేడుకల్లో భాగమయ్యారు.

అంబానీ ఫ్యామిలీకి థ్యాంక్స్‌
మొదటి రోజు పాప్‌ సింగర్‌ రిహాన్నా తన పర్ఫామెన్స్‌తో అల్లాడించేసింది. భారత్‌లో ఇదే తన తొలి లైవ్‌ పర్ఫామెన్స్‌ కావడం విశేషం. ఇక స్టేజీపై మైక్‌ అందుకుని మాట్లాడిన రిహాన్నా.. 'నన్ను ఇక్కడికి ఆహ్వానించిన అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే కాబోయే కొత్త జంట అనంత్‌- రాధికిలకు ఆల్‌ద బెస్ట్‌' అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంబానీ కుటుంబంతో డ్యాన్స్‌
ఇది చూసిన నెటిజన్లు ఆమెకు పెళ్లికూతురి పేరు కూడా పలకడానికి రావడం లేదని సెటైర్లు వేస్తున్నారు. కోట్లు అందుకున్నప్పుడు కనీసం ఆ జంట పేర్లయినా బట్టీ పట్టాల్సిందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇకపోతే స్టేజీపై పోర్‌ ఇట్‌ అప్‌, వైల్డ్‌ థింగ్స్‌, డైమండ్స్‌ సాంగ్స్‌ పాడిన రిహాన్నా.. చివర్లో ఇషా అంబానీ, ముఖేశ్‌ అంబానీతో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఒక్క రోజు పర్ఫామెన్స్‌ కోసం ఆమె ఏకంగా రూ.70 కోట్ల పైనే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: భర్తను అన్‌ఫాలో చేసిన నయనతార.. ఆగమైన ఫ్యాన్స్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)