Breaking News

రెండో పెళ్లి.. ఊహిస్తేనే భయంగా ఉంది: పూనమ్‌ పాండే

Published on Sun, 03/02/2025 - 15:42

పెళ్లి మాట ఎత్తితేనే భయపడుతోంది బోల్డ్‌ బ్యూటీ, నటి పూనమ్‌ పాండే (Poonam Pandey). విడాకుల తర్వాత తన జీవితం సంతోషంగా సాగుతోందని, మళ్లీ ఎవర్నైనా నమ్మాలంటే భయంగా ఉందని చెప్తోంది. పూనమ్‌ పాండే 2020లో ప్రియుడు సామ్‌ బాంబేను పెళ్లి చేసుకుంది. అతడితో గోవాకు హనీమూన్‌కు కూడా వెళ్లింది. ఆ సమయంలో సామ్‌ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్టు కూడా చేశారు. అదే సమయంలో పూనమ్‌ కళ్లు, ముఖంపై గాయాలతో ఆస్పత్రిలో చేరింది.

రెండేళ్లుగా ఒంటరిగానే..
అవన్నీ గుర్తు చేసుకుంటేనే భయపడిపోతోంది పూనమ్‌ పాండే. రెండేళ్లుగా ఒంటరిగా ఉన్నాను. ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాను. వైవాహిక జీవితం నాకు కలిసిరాదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడైతే హాయిగా జీవిస్తున్నాను. నాకు అందమైన కుటుంబం, మంచి కెరీర్‌ ఉంది. ఈ రెండింటితో నేను సంతృప్తిగా ఉన్నాను. మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉందని. ఎవరేంటో తెలుసుకోలేకపోతున్నాను. ఎవర్నీ నమ్మలేకున్నాను అని చెప్పుకొచ్చింది.

వివాదాలతో సావాసం..
గతేడాది గర్భాయ ముఖద్వార క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఏకంగా తాను చనిపోయినట్లు ప్రచారం చేసుకుంది. ఆ వార్తలు వైరలయ్యాక తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకే అలాంటి ప్రాంక్‌ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 2011లో వరల్డ్‌కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద నూలుపోగులేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఇలాంటి సంచలన కామెంట్లు, డ్రామాలతోనే పూనమ్‌ ఎక్కువ పాపులర్‌ అయింది.

చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్‌ రెడ్డి వంగా

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)