Breaking News

రెండేళ్లుగా ఆ వ్యాధితో ఇబ్బందులు.. ప్రముఖ డాక్టర్‌ను కలిసిన పూనమ్‌ కౌర్‌

Published on Fri, 02/02/2024 - 09:07

ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్‌ను ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి గత రెండేళ్లుగా ఇబ్బంది పెడుతుంది. 2022 సమయంలో ఆమెకు వెన్ను నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కేరళ వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు ఫైబ్రో మయాల్జియా వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గతంలో ఆమె కూడా తెలిపింది. 2022 నుంచి ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్న పూనమ్‌ అప్పటి నుంచి చికిత్స కూడా తీసుకుంటుంది.  కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో కూడా  చికిత్స తీసుకుంది. 

తాజాగా పూనమ్‌ తన ఆరోగ్యంపై తన ఎక్స్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేసింది. నేచురోపతి వైద్యంలో ఎంతో గుర్తింపు పొందిన  డా.మంతెన సత్యనారాయణ రాజును ఆమె కలుసుకున్నట్లు తెలిపింది. ఆయన్ను కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో అమూల్యం. మంచి మనసుగల వ్యక్తితో ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాధి గురించి చర్చించే అవకాశం కలగడం తన అదృష్టమని ఆమె పేర్కొంది.

ఫైబ్రోమైయాల్జియా వ్యాధితో చాలా ఇబ్బంది పడినట్లు పూనమ్‌ తెలిపింది. కనీసం దుస్తువులు కూడా వేసుకోలేకపోయానని అవి ధరిస్తున్నప్పుడు కూడా పెయిన్స్‌ వచ్చేవని వాపోయింది. దీంతో ఎప్పుడూ వదులుగా ఉన్న దుస్తువులే ధరించాల్సి వచ్చేదని చెప్పింది.

ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు
ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు నిద్రలేమితో భాదపడుతుంటారు. అలసటతో పాటుగా శరీరం మొత్తం విపరీతమైన నొప్పిని కలిగి ఉంటుంది. మెడ, భుజాలు, ఛాతీ, వీపు వద్ద ఎక్కువ పెయిన్‌ ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటుగా డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. ఫైబ్రోమైయాల్జియా కోసం ఒకే పరిమాణానికి సరిపోయే మందులు లేవని వైద్యులు చెబుతున్న మాట. కానీ జీవనశైలి మార్పులతో దీనిని కంట్రోల్‌ చేయవచ్చని వారు చెబుతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)