అల్లు అర్జున్‌పై నటి పూనమ్‌ కౌర్‌ ఆసక్తికర ట్వీట్‌

Published on Sun, 12/22/2024 - 15:31

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడంతో మరోసారి అల్లు అర్జున్‌ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్‌ రోడ్‌ షో చేశాడని, అరెస్ట్‌ కోసం వెళితే దరుసుగా ప్రవర్తించారంటూ బన్నీపై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వెంటనే అల్లు అర్జున్‌ మీడియా సమావేశం పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ..అవన్నీ నూటికి నూరు శాతం అబద్దాలేనని స్పష్టం చేశాడు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ.. మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించండం బాధించిందన్నారు. 

(చదవండి: అల్లు అర్జున్‌ వివాదంపై స్పందించిన డీజీపీ)

ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ వివాదం గురించే చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో నటి పూనమ్‌ కౌర్‌  పుష్ప 2 చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చాలా బాగుందని చెబుతూ.. గంగమ్మ జాతర ఎపిసోడ్‌ని తెలంగాణలోని సమ్మక్క సారలక్క జాతరతో పోల్చుతూ ట్వీట్‌ చేశారు. ‘మొత్తానికి పుష్ప-2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపించారీ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’ అని పూనమ్‌ కౌర్‌ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు. 

(చదవండి: పీలింగ్స్‌ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పులు.. మొదట అసౌకర్యంగా ఫీలయ్యా..)

ఇక పుష 2 విషయానికొస్తే.. సుకుమార్‌ దర్శకత్వం ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్‌ ఫాజిల్‌, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)