Breaking News

గంట లేటైందని సెట్‌లో కమల్‌ హాసన్‌ తిట్టాడు: సీనియర్‌ హీరోయిన్‌

Published on Sun, 03/30/2025 - 12:39

కొందరు సమయపాలన పాటిస్తే మరికొందరేమో సమయానికి రావడం అంటే అదేదో బ్రహ్మ విద్య అన్నట్లుగా ఫీలవుతారు. ఎప్పుడూ చెప్పిన సమయానికంటే ఆలస్యంగానే సెట్‌లో అడుగుపెడతారు. ఈ విషయంలో నటీనటులపై దర్శకనిర్మాతలు లోలోపలే విసుక్కునేవారు. అందరిలాగే కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కూడా అదే బాపతు అనుకున్నాను.. కానీ తన అంచనా తప్పని నిరూపించాడంటోంది హీరోయిన్‌ పూనమ్‌ ధిల్లాన్‌.

ఎప్పుడంటే అప్పుడు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూనమ్‌ ధిల్లాన్‌ (Poonam Dhillon) మాట్లాడుతూ.. సెట్‌లో నాకు మొదటిసారి అక్షింతలు పడింది కమల్‌ హాసన్‌ చేతిలోనే! షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చానని ఆయన నాపై కోప్పడ్డారు. ముంబైలో 30-45 నిమిషాలు ఆలస్యంగా వస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. రాజేశ్‌ ఖన్నా, శతృఘ్న సిన్హా వంటి పెద్ద స్టార్స్‌ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేవారు. వాళ్లను చూసి మేము కూడా ఓ అరగంటయినా ఆలస్యంగా సెట్‌కు వచ్చేవాళ్లం.

గంట ఆలస్యం తప్పు కాదనుకున్నా
ఓసారి చెన్నైలో ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌కు రమ్మన్నారు. నేను ఎనిమిది గంటలకల్లా అక్కడున్నాను. ఆలస్యం చేశానన్న ఫీలింగ్‌ కూడా నాకు లేదు. అందరికీ గుడ్‌ మార్నింగ్‌ చెప్తుంటే ప్రతి ఒక్కరూ నావంక కోపంగా చూస్తున్నారు. వెంటనే కమల్‌.. పూనమ్‌, నీకోసం ఇక్కడున్న అందరూ ఏడు గంటల నుంచి ఎదురుచూస్తున్నారు. లైట్‌మన్‌, కెమెరామెన్‌.. ఎప్పుడో ఇల్లు వదిలేసి బస్సులోనో, ఆటోలోనో ఇంత దూరం నుంచి వచ్చారు. 

క్లాస్‌ పీకిన కమల్‌ హాసన్‌
ఏడు గంటలకల్లా ఇక్కడుండాలని ఐదింటికంటే ముందే నిద్ర లేచి రెడీ అయుంటారు. నువ్వేమో ఎనిమిదింటికి వస్తావా? అందరినీ ఇలా వెయిట్‌ చేయిస్తావా? ఇది కరెక్ట్‌ కాదు అని సున్నితంగా మందలించాడు. అప్పుడు నేను తప్పు తెలుసుకున్నాను. సౌత్‌లో టెక్నీషియన్లకు కూడా సముచిత స్థానం ఇస్తారు. సాయంత్రం టిఫిన్‌, స్నాక్స్‌ ఏవైనా సరే అందరూ తింటారు. దక్షిణాదిలో టెక్నీషియన్లను ఎంతగానో గౌరవిస్తారు అని చెప్పుకొచ్చింది. పూనమ్‌ ధిల్లాన్‌.. కమల్‌ హాసన్‌తో యే తో కమాల్‌ హో గయా, యాద్‌గర్‌, గెరాఫ్తార్‌ సినిమాలు చేసింది.

చదవండి: సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తారు: బాలీవుడ్‌ స్టార్‌

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)