Breaking News

సరస్వతి చాలా బలమైన కథ: పూజా శరత్‌కుమార్‌

Published on Wed, 03/04/2026 - 00:30

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సరస్వతి’. ఆమె సోదరి పూజా శరత్‌కుమార్‌ ఈ సినిమాకు ఓ నిర్మాత. ప్రియమణి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, రాధికా శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల  కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పూజా శరత్‌కుమార్‌ మాట్లాడుతూ – ‘‘సరస్వతి’ మంచి క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. సోషల్‌ మెసేజ్‌ కూడా ఉంది. ‘ప్రతి అమ్మాయి సరస్వతిలాగా ఉండదు. సమయం వచ్చినప్పుడు కాళీలా మారుతుంది’ అనే డైలాగ్‌ ఈ సినిమా ట్రైలర్‌లో ఉంది. కథ వెనక ఉన్న ఆలోచన అదే... చాలా బలమైన కథ.

ఒక స్ట్రాంగ్‌ ఉమన్‌ క్యారెక్టర్‌ను థియేటర్స్‌లో చూస్తారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ముఖ్యమైనదే. అలాగే కీలకమైన కోర్టు సీన్‌ ఉంది. ఈ ఏడు నిమిషాల సింగిల్‌ షాట్‌ చాలా ఆసక్తిగా ఉంటుంది. సినిమా థ్రిల్లింగ్, ట్విస్ట్‌లతో గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం. వరలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్‌ అమ్మాయి అయిపోయింది. తన డైరెక్షన్‌లోని తొలి సినిమా తెలుగులోనే ఉండాలని బలంగా అనుకుంది. పరిశ్రమలో వరలక్ష్మి జర్నీ స్ఫూర్తిదాయకమైనది. ఆమెకు ‘సరస్వతి’ ప్రౌడ్‌ మూమెంట్‌.

ఈ సినిమా ప్రోగ్రెస్‌ గురించి మా నాన్న (నటుడు శరత్‌కుమార్‌)గారు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. అవుట్‌పుట్‌ పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇక నేను కొన్ని మ్యూజిక్‌ షోలు చేశాను. ఇందులో రెహమాన్‌గారివి కూడా ఉన్నాయి. ఆ తర్వాత రాడార్‌ (నటి రాధిక బేనర్‌)లో కొన్నేళ్ళు పని చేశాను. అయితే నాకు కెమెరా వెనక ఉండటమే ఇష్టం.

యాక్టింగ్‌ అస్సలు రాదు. ‘సరస్వతి’ కథ గురించి బాపినీడుగారికి చెబితే, మేమూ నిర్మాణంలో భాగమవుతాం అన్నారు. బన్నీ వాసుగారికి కంటెంట్‌ నచ్చింది. ఇలా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా మా సినిమా రిలీజ్‌ అవుతోంది. మార్చి 5న మా ‘సరస్వతి’ సినిమా ప్రీమియర్స్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. మా బ్యానర్‌లో కొత్త సినిమాల కోసం స్క్రిప్ట్స్‌ వింటున్నాం’’ అన్నారు.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)