Breaking News

పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..?

Published on Sat, 10/25/2025 - 07:22

సక్సెస్‌ వల్ల ఇమెజ్‌ వస్తుంది. ఆ ఇమేజ్‌ను వాడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు తెరపైకి వచ్చే మొదటి విషయం పారితోషకం. సాధారణంగా ఇప్పుడు హీరోయిన్ల పారితోషకం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకూ ఉంటోంది. అది వారి ఇమేజ్‌ను బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే క్రేజ్‌ ఉన్న హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటించడానికి పారితోషికాన్ని కాస్త ఎక్కువగానే డిమాండ్‌ చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటిస్తూ పారితోషకాన్ని అధిక మొత్తంలో పుచ్చుకుంటున్నారు. ఇందుకు పూజా హెగ్డే అతీతం కాదు. 

ఈ అమ్మడు ఇంతకుముందు తెలుగులో రంగస్థలం చిత్రంలో జిల్‌జిల్‌జిగేలు రాజా అనే ఐటమ్‌ సాంగ్‌లో నటించి బాగా పాపులర్‌ అయ్యారు. ఆ తరువాత కూలీ చిత్రంలో మోనికా పాటలో నటించి అందరిని అలరించారు. తాజాగా మరో భారీ చిత్రంలో ప్రత్యేక పాటలో చిందేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో  అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే 5, 6 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అందులో దీపికా పడుకొనే, జాన్వీకపూర్‌, మృణాల్‌ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్‌ హీరోయిన్ల పేరు చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో పూజాహెగ్డేను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 5నిమిషాలపాటు సాగే ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు రూ.5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇకపోతే ఈ మధ్య అవకాశాలు లేని ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు.     

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)