Breaking News

అవమానాలు తప్పవు.. పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sun, 07/26/2026 - 08:47

పాన్‌ ఇండియా కథానాయికలుగా రాణిస్తున్న వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. దశాబ్దానికి పైగా తెలుగు ,తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా కొనసాగుతున్న ఈ బ్యూటీకి అందరూ నటీమణుల మాదిరిగానే కెరీర్‌ పరంగా అవరోధాలు ఎదురయ్యాయి. చిత్రాల జయాపజయాలు అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. అయినా కొన్ని చిత్రాల అపజయాలకు నటి పూజా హెగ్డేను బాధ్యతను చేయడంతో చాలా అవకాశాలు దూరం అయ్యాయి. 

అయితే అలాంటి వాటిని మళ్లీ అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతున్నారు. అలా  నటుడు విజయ్‌ సరసన కథానాయకి నటించిన చిత్రం జననాయకన్‌. ఇంతకుముందు ఆయన సరసన నటించిన బీస్ట్‌ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ జననాయకన్‌ చిత్రంతో మరో అవకాశాన్ని అందుకున్నారు. 

ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం వసూళ్లు కురిపిస్తోంది. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ  ‘‘ సినిమా అనేది ఒక ఇసుక ఊబి లాంటిది. జాగరూకత లేకుంటే చిక్కుకుపోతాం. అలా చిక్కుకుంటే చెల్లా చెదురవుతాం. అందువల్ల పోటీ ఉన్నా, రాగద్వేషాలు లేకుండా పయనించాలి.  శ్రమ, నమ్మకం ఉంటేనే  సినిమాలో జయించగలం. ఇక్కడ విజయం సాధించిన వారంతా పలు సమస్యలను అధిగమించినవారే అయ్యి ఉంటారు. ఎందుకంటే అవమానాలను , పరాభవాలను ఎదుర్కోకుండా సినిమాల్లో రాణించటం సాధ్యం కాదు ‘‘ అని నటి పూజా హెగ్డే పేర్కొన్నారు. దీంతో ఆమె తన  స్వానుభవాన్ని  బయట పెట్టినట్లుంది అనే కామెంట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)