బాక్సాఫీస్‌ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్‌ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..

Published on Sat, 04/29/2023 - 13:41

లెజెండరీ ఫిల్మ్‌ మేకర్‌ మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పొన్నియన్‌ సెల్వన్‌. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం గతేడాదిలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న (ఏప్రిల్‌28) రెండో భాగం పొన్నియన్‌ సెల్వన్‌ 2 రిలీజైంది. ఈ చిత్రాని​కి ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వినిపించింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.54 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది.  

(చదవండి: పొన్నియన్‌ సెల్వన్‌ 2 మూవీ రివ్యూ)

వీటిలో ఒక్క తమిళనాడులోనే రూ.21 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ నమోదు చేసింది. కేరళలో రూ.2.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.80 కోట్లు, కర్ణాటకలో రూ.4.05 కోట్లు, రెస్టాఫ్‌ ఇండియాలో రూ.2.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.24.70 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.  ఈ చిత్రం మొత్తంగా రూ.170 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ.172 కోట్లు సాధించాలి. తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ లభించింది. దీంతో వీకెండ్‌లోగా ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

(చదవండి: నాటు నాటు నా టాప్‌ సాంగ్స్‌ లిస్టులోనే లేదు: కీరవాణి షాకింగ్‌ కామెంట్స్‌)

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్ చియాన్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్‌ రాజ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)