Breaking News

హీరో విజయ్‌ నన్ను బెదిరిస్తున్నాడు.. అరెస్ట్‌ చేయండి: ప్రియ

Published on Fri, 07/07/2023 - 12:06

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌- డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రానున్న'లియో' మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'నా రెడీ' పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారంటూ పలువురు కోర్టుకు కూడా వెళ్లారు. వారిలో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా ఉన్నారు. ఆమె పలుమార్లు మీడియా సమావేశాలు పెట్టి విజయ్‌ని టార్గెట్‌ చేసి తప్పబట్టిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి)

ఈ నేపథ్యంలో నటుడు విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై డీజీపీ కార్యాలయంలో రాజేశ్వరి ప్రియ ఫిర్యాదు చేశారు.  విజయ్‌ సినిమాలో వచ్చిన స్మోకింగ్ వీడియోలపై నిరసనలు వ్యక్తం చేసినందుకే... స్మోకింగ్‌ వల్ల క్యాన్సర్‌ వస్తుందనే పదాలను చిత్ర బృందం పాటలో పెట్టిందని ఆమె తెలిపింది. తను చేసిన ఈ పోరాటం వల్ల హీరో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతూ నిరంతరం బెదిరిస్తున్నారని చెప్పింది. ముఖ్యంగా విజయ్ సోషల్‌ మీడియా ఐడీని ట్యాగ్ చేస్తూ అందరూ తనపై అసభ్యపదజాలంతో కామెంట్లు పెడుతున్నారని పేర్కొంది.  హీరో విజయ్ కూడా తనను బెదిరించాడని తెలిపింది.

(ఇదీ చదవండి: వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వడం లేదు: హీరోయిన్ ఐశ్వర్య)

ఓ మహిళను అసభ్యకరంగా మాట్లాడేలా తన అభిమానులను ప్రేరేపించిన విజయ్‌ని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. సినిమాల్లో అందరూ సిగరెట్లు తాగుతారు.. మరీ విజయ్‌పై మాత్రమే ఫిర్యాదు ఎందుకు? అని ప్రశ్నించగా.. గతంలో రజనీకాంత్‌పై కూడా ఇదే విషయంలో ఫిర్యాదు చేశామని ఆమె గుర్తు చేసింది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)