Breaking News

జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల ఛార్జ్‌ షీట్‌లో కీలక అంశాలు!

Published on Wed, 12/25/2024 - 19:34

జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ కొరియోగ్రాఫర్(choreographer) ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్ట్‌ చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జానీ విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్‌ షీట్ దాఖలు చేశారు.

లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఛార్జ్‌ షీట్‌లో పోలీసులు

పలు ఈవెంట్స్‌ పేరుతో మహిళ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వేధింపులకు గురి చేసినట్లు అందులో ప్రస్తావించారు. కాగా.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్‌)

అసలేం జరిగిందంటే..

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు వాపోయింది. దీంతో జానీపై లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)