పుష్ప 2: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్‌

Published on Sun, 12/08/2024 - 19:27

సాక్షి, హైదరాబాద్‌: పుష్ప 2 ప్రీమియర్స్‌లో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే  రేవతి మృతిచెందినట్లు తేల్చిన పోలీసులు ఆదివారం ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. సంధ్య థియేటర్‌ యజమాని, సెక్యూరిటీ మేనేజర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ సంధ్య థియేటర్‌లో డిసెంబర్‌ 4న పుష్ప 2 ప్రీమియర్స్‌ ఏర్పాటు చేశారు. సినిమా చూసేందుకు జనం భారీ ఎత్తున వచ్చారు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్‌ కూడా థియేటర్‌కు రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరగ్గా దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు అటు సంధ్య థియేటర్‌ యాజమన్యంతో పాటు అల్లు అర్జున్‌ టీమ్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ విషాదంపై అల్లు అర్జున్‌ స్పందిస్తూ రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

సినిమా విషయానికి వస్తే.. 
అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా మూవీగా రిలీజైంది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు రూ.294 కోట్లు రాబట్టి అందరితో ఔరా అనిపించింది. ఓవరాల్‌గా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లు వసూలు చేసింది. పుష్ప దూకుడు చూస్తుంటే వెయ్యి కోట్లు అవలీలగా వచ్చేట్లు కనిపిస్తోంది. 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)