Breaking News

'పెళ్లి చూపులు' కోసం ప్లాన్‌ చేస్తున్న విజయ్‌ దేవరకొండ

Published on Tue, 10/29/2024 - 08:37

విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన  సినిమా 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన 'పెళ్లి చూపులు' అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. రెండు జాతీయ అవార్డ్స్‌ దక్కించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఈమేరకు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుత సమయంలో విజయ్‌కు ఒక భారీ హిట్‌ తప్పనిసరి.. ఈ క్రమంలో తనకు గతంలో సూపర్‌ హిట్స్‌ ఇచ్చిన దర్శకులతో సినిమా చేసేందుకు విజయ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఇలాంటి టైమ్‌లోనే విజయ్‌కి ఒక చక్కటి కథను తరుణ్‌భాస్కర్‌ వినిపించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఒక యాక్షన్‌ సినిమాను తీసేందకు ఆయన రెడీ అవుతున్నారట. వీరిద్దరి సినిమా కోసం బడ్జెట్‌ ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారని టాక్‌. అయితే, ఫైనల్‌గా విజయ్‌ ఈ ప్రాజెక్ట్‌పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి చూపులు సినిమా తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో రెండు జాతీయ అవార్డ్స్‌ దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌తో పాటు, రెండు నందులను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం హిందీ,తమిళ్‌, మలయాళంలో రీమేక్‌ అయింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)