Breaking News

'పెద్ది' గ్లింప్స్‌ వచ్చేసింది.. సిక్సర్‌ కొట్టిన రామ్‌ చరణ్‌

Published on Sun, 04/06/2025 - 11:46

'పెద్ది' సినిమాతో దుమ్మురేపేందుకు రామ్‌చరణ్‌ రెడీ అయిపోయాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో  మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌ పతాకంపై  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన రామ్‌చరణ్‌ ఫస్ట్‌ లుక్‌కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్‌ షాట్‌ పేరుతో ఒక వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. శ్రీరామ నవమి (ఏప్రిల్‌ 6) సందర్భంగా విడుదలైన తొలి షాట్‌ అదిరిపోయింది. 

ఫస్ట్‌ బాల్‌కే చరణ్‌ సిక్సర్‌ కొట్టేశాడని చెప్పవచ్చు. తన జట్టును గెలిపించేందుకు మాస్‌ లుక్‌లో బరిలోకి దిగాడు చరణ్‌. సినీ అభిమానులను మెప్పించేలా పెద్ది గ్లింప్స్‌ ఉంది. గేమ్‌ ఛేంజర్‌ ఎఫెక్ట్‌ ఈ సినిమా బయటపడేస్తుందని ఆయన ఫ్యాన్స్‌ ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్‌ సరికొత్తగా మేకోవర్‌ అయ్యారు.  2026 మార్చి 27న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్‌లో తెలిపారు.

జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్‌ రెహమాన్ అందించగా కెమేరామెన్‌గా ఆర్‌. రత్నవేలు ఉన్నారు. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం ఉంటుందని రామ్‌చరణ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)