Breaking News

పారితోషికం భారీగా పెంచేసిన జాన్వీ.. ‘పెద్ది’కి ఎంతంటే..

Published on Sun, 07/20/2025 - 09:58

అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసురాలుగా ఏడేళ్ల క్రితం సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్(Janhvi Kapoor)‌. హిందీలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు భారీ హిట్‌ పడిందే లేదు. తెలుగులో మాత్రం దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అటు బాలీవుడ్‌లోనూ, ఇటు సౌత్‌లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అయినా కూడా ఇప్పటికీ ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో సాలిడ్‌ హిట్‌ పడలేదు. కానీ రెమ్యునరేషన్‌ మాత్రం సినిమా సినిమాకి పెంచేస్తుంది. బాలీవుడ్‌ కంటే సౌత్‌ సినిమాలకే ఎక్కువ పారితోషికం పుచ్చకుంటుందట.

తొలి టాలీవుడ్‌ మూవీ దేవరకు రూ. 5 కోట్లు పారితోషికంగా పుచ్చుకుంది ఈ బ్యూటీ. అప్పటి వరకు ఆమెకు అదే అత్యధిక పారితోషికం. ఆ తర్వాత పెద్ది సినిమాలో చాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకు మరో కోటి పెంచేసిందట. ఈ సినిమాకు గాను రూ. 6 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.  

అల్లు అర్జున్‌-అట్లీ సినిమాలోనూ ఓ పాత్ర కోసం జాన్వీ కపూర్‌ని సంప్రదించారట. ఈ చిత్రానికి మరో కోటి పెంచేసి..మొత్తంగా రూ. 7 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందట. దీంతో చిత్రబృందం ఆమెతో బేరాలు సాగిస్తునారట. కాస్త తగ్గిస్తే ఆమెను తీసుకుందామని అనుకుంటున్నారట. జాన్వీ మాత్రం తగ్గేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ టాక్‌.  బాలీవుడ్‌లో తక్కువ తీసుకొని తెలుగు సినిమాలకు ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకోవడం సరికాదని, ఇలా అయితే ఆమె కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)