Breaking News

టాలీవుడ్‌ డైరెక్టర్లపై పాయల్ రాజ్‌పూత్‌ సెన్సేషనల్ కామెంట్స్

Published on Sun, 07/02/2023 - 13:07

2018 జులై 12.. 'ఆర్‌ఎక్స్‌ 100' థియేటర్‌లో విడుదలైంది. సినిమా హిట్‌.. అందాల విందుతో పాటు అదిరిపోయే నటనను ప్రదర్శించిన పాయల్‌ రాజ్‌పూత్‌ గురించి అప్పట్లో అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ‘నటి ఎవరు? రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సాధించింది..’ అనుకున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ లిస్ట్‌లో ఉంటుందని అందరూ భావించారు కానీ అది నిజం కాలేదు.  'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో ఆమెకు ఫ్యాన్‌ బేస్‌ పెరిగింది కానీ. తరువాత తను చేసిన సినిమాల విషయంలో ఎంపిక సరిగా లేకపోవడంతో పాయల్ వెనకపడిపోయింది.

(ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్‌?)

తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో తన కెరియర్‌ గురించి ఇలా చెప్పింది. 'ఆర్‌ఎక్స్‌ 100' తర్వాత టాలీవుడ్‌లో నన్ను కొంతమంది తప్పుదోవ పట్టించారు. ఆ సినిమా విజయం తర్వాత వెంటనే నేను మాత్రమే హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యాను. దాంతో ఇక్కడున్న కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. సినిమాల ఎంపిక విషయంలో వారు నన్ను మిస్ గైడ్ చేశారు. పలాన సినిమా మాత్రమే చయండి.. వారితో ఇలా మెలగండి అంటూ సలహాలిచ్చేవారు. చివరకు కొందరు దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించి, అప్పట్లో నాకున్న ఫేమ్‌ను వాడుకున్నారని' సంచలన కామెంట్స్ చేసింది పాయల్. 

ప్రస్థుతం  అన్ని రకాలుగా అలోచించే సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నానని పాయల్‌ తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్‌లో తనకు ఎలాంటి  సమస్యలు లేవని తెలిపింది. ఎటువంటి సినిమాలు చెయ్యాలో  బాగా అలోచించిన తర్వాతే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నానని తెలిపింది. సినిమా రంగంలో ఎవరైనా టాప్ లోకి వెళతాం.. అలాగే కిందకి కూడా పడిపోతాం ఇదీ సహజం. కానీ వాటిని తట్టుకొని నిలబడాలని ఈ బ్యూటీ పేర్కొంది. నెగటివిటీని వదిలేసి.. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నాని తెలిపింది.  'ఆర్‌ఎక్స్‌ 100'తో లైఫ్‌ ఇచ్చిన అజయ్ భూపతినే తనకు మరో ఛాన్స్‌ ఇచ్చారు. వీరి కాంబోలో 'మంగళవారం' సినిమాతో మళ్లీ రాబోతున్నారు.

ప్రభాస్‌పై కామెంట్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అంటే చాలా ఇష్టమని పాయల్‌ తెలిపింది. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు ఒక అవకాశం రావాలని కోరుకుంటున్నానని తను తెలిపింది. ఆయన హైట్‌కు తగినట్లు మ్యాచ్‌ అవుతానని ఈ బ్యూటీ చెప్పింది. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలలో ఈ బ్యూటీ ప్రభాస్‌ అంటేనే చాలా ఇష్టమని చెప్పింది. ఐకాన్‌ స్టార్‌ బన్నీ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టమని పేర్కొంది.


(ఇదీ చదవండి: Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుని..)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)