Breaking News

'పాయల్ రాజ్‌పుత్' ఇంట తీవ్ర విషాదం

Published on Wed, 07/30/2025 - 09:04

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్' (67) కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన జులై 28 మరణించారు. అయితే, కాస్త ఆలస్యంగా విషయాన్ని పాయల్తన సోషల్మీడియా ద్వారా తెలిపింది. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారని ఇదే ఏడాదిలో ఆమె చెప్పిన విషయం తెలిసిందే. తండ్రి మరణంపై ఆమె చాలా ఎమోషనల్అయింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రిని కాపాడుకునేందుకు తాను చేయాల్సినవన్నీ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ, తన నాన్నను కాపాడే పోరాటంలో విజయం సాధించలేకపోయానని ఆమె పేర్కొంది. క్షమించండి నాన్న అంటూ పాయల్ఒక పోస్ట్చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు.

పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది. పాయల్ రాజ్‌పుత్ ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు మెసేజ్‌లు పెడుతున్నారు. హీరోయిన్‌ లక్ష్మిరాయ్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ వంటి వారు ఆమెకు సానుభూతి తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. ఇలాంటి సమయంలో మరింత బలంగా ఉండాలని కోరారు.

పాయల్ రాజ్‌పుత్ ‘RX 100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలలో నటించి పాపుల‌ర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వెంకటలచ్చిమి" అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)