వైరల్‌ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా

Published on Thu, 04/16/2026 - 08:14

సినీ నటుడు, ఎపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో తరుచుగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు కూడా తన పేజీలోనే సమాధానం చెబుతున్నారు. ఆపై పవన్‌తో ప్రేమ విషయాలను కూడా ఆమె రివీల్‌ చేశారు. వారిద్దరిలో ముందుగా ఎవరు ప్రపోజ్‌ చేశారో కూడా పేర్కొన్నారు. అయితే, తాజాగా ఒక ఆసక్తికరమైన ఫోటో గురించి ఆమె రివీల్‌ చేశారు.

చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న ఒక పాత ఫోటోపై పవన్ సతీమణి అన్నా లెజినోవా స్పందించారు. పవన్‌ నటించిన 'తీన్ మార్' సినిమా నాటి ఒక పాత చిత్రాన్ని ఆమె స్టోరీస్‌లో షేర్‌ చేశారు. అందులో పవన్ కల్యాణ్‌ పక్కన ఒక విదేశీ మహిళ పక్కన కూర్చుని ఉన్నారు. అయితే, ఈ ఫోటో వారి పెళ్లికి ముందు తీసినదని, అందులోని మహిళ అన్నానే అని చాలామంది భావించారు. అయితే, ఫోటోలోని వ్యక్తి తాను కాదని, ఆమె పేరు డానా మార్క్స్ అని  స్పష్టం చేశారు. 

తాను ఎప్పుడూ మోడల్‌లాగా గానీ, నటిలాగా గానీ కనిపించలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. చాలా ఏళ్లుగా ఈ ఫోటోలో ఉన్నది అన్నా లెజినోవానే అని కొందరు షేర్‌ చేస్తూ రావడంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా  'తీన్ మార్' సినిమాలో ఒక పాటలో అన్నా లెజినోవా కొన్ని సెకన్స్‌ మాత్రమే కనిపిస్తారు. 

సినీ నటి రేణు దేశాయ్‌తో విడాకుల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఆమెను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తమ ప్రేమ విషయం గురించి కూడా అన్నా లెజినోవా క్లారిటీ ఇచ్చారు. మీ ఇద్దరిలో మొదటగా ఎవరు ప్రపోజ్ చేశారు..?  పవన్ కల్యాణ్‌ నుంచే ఫస్ట్ ప్రపోజ్ వచ్చిందా..? అని ఒక అభిమాని అడగ్గా.. దీనికి అన్నా లెజినోవా స్పందిస్తూ.. అవును, ఆయనే (పవన్) మొదటగా ప్రపోజ్ చేశారు” అని క్లారిటీ ఇచ్చారు. 
 

Videos

మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..

బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!

మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..

తేల్చుకుందాం.. ఆ నొప్పి ఎలా ఉంటదో చూపిస్తాం.. చెవిరెడ్డి మాస్ వార్నింగ్

విద్యలోకి రాజకీయాలు? స్కూల్ పేపర్ లో లడ్డు కల్తీ ప్రశ్న

జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్

డబుల్ ధమాకా..! ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

టీడీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ పై పేర్ని నాని, వల్లభనేని వంశీ ఫిర్యాదు

ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)

+5

మత్స్యకారులతో వైఎస్‌ జగన్‌ మమేకం (ఫొటోలు)

+5

తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న నభా నటేశ్ (ఫొటోలు)