Breaking News

నిధీని చూసి సిగ్గు తెచ్చుకొని ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నా: పవన్‌ కల్యాణ్‌

Published on Tue, 07/22/2025 - 12:28

‘‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu Movie) సినిమా క్రిష్‌గారి వల్ల  నా దగ్గరకు వచ్చింది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల ఆయన మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత జ్యోతికృష్ణ ఈ సినిమాను హ్యాండిల్‌ చేశారు. ఇక నేను డిప్యూటీని సీయంని కావొచ్చు. కానీ ఈ సినిమాకు హీరోని. నిధీ అగర్వాల్‌గారు యాక్టివ్‌గా ఈ సినిమా ప్రమోషన్‌ చేయడం చూసి, సిగ్గు తెచ్చుకుని నేను మీడియా ఇంట్రాక్షన్‌లో పాల్గొంటున్నాను’’ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్‌  కల్యాణ్‌(Pawan Kalyan) అన్నారు. 

పవన్‌  కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్‌ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటక మంత్రి కె. ఈశ్వర్‌ ముఖ్య అతిథులుగా ΄ాల్గొని, ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఇంకా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ – ‘‘హరిహర వీరమల్లు’ అనేది కల్పిత పాత్ర. విజయవాడ దగ్గరలోని కొల్లూరు దగ్గర్లో లభించిన కోహినూర్‌ వజ్రం నిజాం నవాబు దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత మొఘలులకు వెళ్లి, ఫైనల్‌గా... ఇప్పుడు లండన్‌ మ్యూజియంలో ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని క్రిష్‌గారు కథ చెప్పారు. మా చేతుల్లో ఉన్నది ది బెస్ట్‌ ఇవ్వడం. అది చేశాం. మీకు (అభిమానులు, ప్రేక్షకులు) నచ్చిందా బద్దలు కొట్టేయండి’’ అన్నారు.

 ‘‘మేమెంతో కష్టపడి తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు దయాకర్‌ రావు. ‘‘1684 నుంచి ‘హరిహర వీరమల్లు’ కథ మొదలవుతుంది’’ అని అన్నారు జ్యోతికృష్ణ. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కీరవాణి తదితరులు పాల్గొన్నారు.  

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)