Breaking News

BRO Trailer: కనీవినీ ఎరుగని రెమ్యునరేషన్‌.. డైలాగులే మైనస్‌!

Published on Sun, 07/23/2023 - 10:22

సాధారణంగా ఓ మూవీ ట్రైలర్‌లో ది బెస్ట్‌ సీన్స్‌ని మాత్రమే చూపిస్తారు. సినిమా మొత్తంలో అవే కీలకం అనేలా ట్రైలర్‌ని కట్‌ చేస్తారు. ఎందుకంటే ఓ ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడంలో పాటలతో పాటు ట్రైలర్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రెండింటిలో ‘బ్రో’మూవీ విఫలమైంది. తమన్‌ అందించిన పాటలపై తొలి నుంచి విమర్శలే వచ్చాయి. తమ హీరోకి సరైన పాటలు అందించలేదని పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్సే తమన్‌ను ట్రోల్‌ చేశారు. ఇక నిన్న విడుదలైన ట్రైలర్‌ కూడా ఫ్యాన్స్‌ని కాస్త నిరాశకే గురి చేసింది. పవన్‌ నోట ఒక్కటంటే ఒక్కటి గుర్తించుకునే డైలాగ్‌ ట్రైలర్‌లో చూపించలేదు. 

‘బ్రో’సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్‌ అయిన `వినోదయ సీతం`కు తెలుగు రీమేక్‌. ఈ చిత్రాన్ని పవన్‌తో సెట్‌ చేసింది అతని ‘గురువు’ త్రివిక్రమ్‌. ‘వినోదయ సీతం’ కథంతా మార్చేసి కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించినా.. మిగతావన్నీ త్రివిక్రమే చూసుకున్నాడు. తొలుత మాటల కోసం సాయి మాధవ్‌ బుర్రా అనుకుంటే.. త్రివిక్రమే రంగంలోకి దిగి మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు. ఇందుకుగాను రూ.15 కోట్లతో పాటు లాభాల్లో పావలా వాటాను రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని టాలీవుడ్‌ టాక్‌.

(చదవండి: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ)

కేవలం స్క్రీన్‌ప్లే, మాటల కోసం ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ తీసుకోవడం ఇదే తొలిసారి. అయితే నిన్నటి ట్రైలర్‌లో మాత్రం త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌ కనిపించలేదు. ట్రైలర్‌లోనే అలాంటి డైలాగ్స్‌ లేవంటే.. సినిమాలో కూడా లేనట్టే. పాటలు, ట్రైలర్‌ యావరేజ్‌గా ఉన్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే.. జులై 28వరకు ఆగాల్సిందే. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)