Breaking News

పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స

Published on Sun, 04/19/2026 - 09:01

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్‌(Pavan Kalyan)కు శస్త్రచికిత్స జరిగింది.  ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. శుక్రవారం ఉదయం సడెన్‌గా పవన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.

వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్‌ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు.

2018లో పవన్‌ కల్యాణ్‌ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని  ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో  శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్‌ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు.  రంగస్థలం మూవీ సక్సెస్ మీట్‌లో  ఈ విషయాన్ని పవన్‌ వెల్లడించారు.

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)