Breaking News

OG 2 Update: ‘ఓజీ’ మళ్లీ వస్తున్నాడు..ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు

Published on Fri, 06/12/2026 - 08:18

సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ పవన్‌ ఫ్యాన్స్‌కి మాత్రం ఆకట్టుకుంది. 

ఈ చిత్రానికి పార్ట్‌ 2 చేసే అవకాశం ఉందని ప్రమోషన్స్‌లోనే చెప్పాడు సుజీత్‌. ఓజీ’ ప్రీక్వెల్‌, సీక్వెల్‌ ఉంటాయని పవన్‌ కల్యాణ్‌ కూడా వెల్లడించారు. అయితే పార్ట్‌ 2 ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయంగా పవన్‌ బిజీ కావడంతో ఓజీ 2 రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు పవన్‌. ‘ఓజీ 2’అప్‌డేట్‌ ఇచ్చాడు.

‘ఇచ్చిన మాట ప్రకారమే ఆయన చేస్తారు. అయితే ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయి’ అంటూ పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ ట్వీట్‌ చేసింది. దీంతో ఓజీ 2 కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 

ప్రస్తుతం సుజిత్‌.. నానితో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ని కూడా ప్రారంభించారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఓజీ2 ప్రాజెక్టును మొదలు పెట్టాలని సుజిత్‌ భావిస్తున్నాడట. 
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)