Breaking News

సినీ ఇండస్ట్రీలో విషాదం.. సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ సహనటి మృతి!

Published on Sun, 08/31/2025 - 12:29

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటి ప్రియా మరాఠే(38) కన్నుమూసింది. పలు టీవీ సీరియల్స్లో నటించిన ఆమె చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో ఆమె బాధపడుతోంది. సుదీర్ఘకాలం క్యాన్సర్పోరాటం చేసిన ప్రియా మరాఠే మీరా రోడ్‌లోని తన నివాసంలోనే మరణించింది.

మరాఠీకి చెందిన నటి ప్రియా మరాఠే 1987 ఏప్రిల్ 23న ముంబయిలో జన్మించింది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. అనంతరం మరాఠీ సీరియల్ 'యా సుఖనోయ'తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తర్వాత పలు హిందీ, మరాఠీ సీరియల్స్లో నటించింది. బాలీవుడ్లో పవిత్ర రిష్టా సీరియల్తో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో సుశాంత్ రాజ్పుత్, అంకిత లోఖాండే కీలక పాత్రల్లో నటించారు. ప్రియా చివరిసారిగా మరాఠీ సీరియల్ తుజెచ్ మి గీత్ గాత్ ఆహేలో కనిపించింది. కాగా.. ప్రియా 2012లో నటుడు శంతను మోఘేను వివాహం చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్లేదు. చివరిసారిగా ఆగస్టు 11, 2024న పోస్ట్ చేసింది. నటి తన భర్తతో జైపూర్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.

ప్రియా మరాఠే తన కెరీర్‌లో చార్ దివాస్ ససుచే, కసమ్ సే, పవిత్ర రిష్టా, ఉత్తరన్, తూ తిథే మీ, భాగే రే మన్, సాథ్ నిభానా సాథియా, స్వరాజ్యరక్షక్ సంభాజీ, జయస్తుతే, భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్ లాంటి సీరియల్స్తో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా హిందీలో హమ్నే జీనా సీఖ్ లియా చిత్రంలో కనిపించారు. మరాఠీ చిత్రం 'తి అని ఇటార్'లోనూ నటించారు. ఈ విషాద వార్త విన్న ప్రియా మరాఠే అభిమానులు, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)