Breaking News

పవిత్ర గౌడకు అస్వస్థత.. పోలీసుల ప్రశ్నలే కారణమా..?

Published on Wed, 06/19/2024 - 07:35

కన్నడ చిత్రపరిశ్రమలో రేణుకాస్వామి హత్య పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడను గత కొద్దిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. రేణుకాస్వామి తనకు అసభ్య మెసేజ్‌లు పెడుతున్నట్లు తన ప్రియుడు హీరో దర్శన్‌కు చెప్పడంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు వద్ద ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పవిత్ర గౌడను పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఆమె తీవ్రంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

పవిత్ర గౌడను గత 10 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం కాస్త దెబ్బతినడంతో చికిత్స కోసం బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు చేర్పించారు. రేణుకాస్వామి హత్య జరిగిన సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును ఇది వరకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది.

ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో   హీరో దర్శన్ ఫాంహౌజ్‌ మేనేజర్ శ్రీధర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్‌ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్‌ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపాడు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)