Breaking News

జైలులో 'పవిత్ర గౌడ' గొంతెమ్మ కోరికలు.. తీర్చాలంటూ గొడవ

Published on Mon, 06/24/2024 - 16:14

ఆటో డ్రైవర్‌ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్‌ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు.  రేణుకస్వామి సోషల్‌ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్‌తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్‌ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది  జైలులో ఉన్నారు.

జైల్లో పవిత్ర గౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు ఒక దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలంటూ ఆమె గొడవ చేసినట్లు తెలిసింది. జైలులో ఉండి కూడా అది కావాలి, ఇది కావాలంటూ అక్కడ ఉన్న మహిళా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించారట. దీంతో పోలీసులు కూడా ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చారట. ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారట.

దర్శన్‌కు ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం రావచ్చిని ఆయన్ను ప్రత్యేకమైన బ్యారక్‌లో ఉంచారు. రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్‌, మజ్జిగ ఇచ్చారు. కానీ, భోజనం చేయని దర్శన్‌ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్‌ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్‌ పలావ్‌ ఆరగించారు. భద్రత కోసం దర్శన్‌ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)