Breaking News

నేను విషం తాగి చస్తే మనశ్శాంతిగా ఉంటుందా? పావలా శ్యామల ఆవేదన

Published on Sun, 01/12/2025 - 18:04

ప్రముఖ నటి పావలా శ్యామల (Pavala Syamala)  కొన్నేళ్లుగా అనారోగ్యంతో సతమతమవుతోంది. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు అనారోగ్యం ఆమెను కుంగదీస్తోంది. మొదట్లో అద్దె ఇంట్లో ఉన్న ఆమె తర్వాత అనాథాశ్రమంలోకి షిఫ్ట్‌ అయింది. దాదాపు 300 సినిమాలు చేసి గొప్ప నటిగా కీర్తి పొందిన ఆమె ఏళ్ల తరబడి సాయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె అడిగినప్పుడల్లా ఒకరిద్దరు సాయం చేస్తున్నా అది తన మందులకే సరిపోతోంది.

కొన ఊపిరితో ఉన్నా..
ఈ క్రమంలో తాజాగా మరోసారి పావలా శ్యామల తనకు సాయం చేయమని అర్థిస్తోంది. 'యాభై ఏళ్లు ఆర్టిస్టుగా బతికాను. ఈ మూడు సంవత్సరాల నుంచి నాకు ఎంత కష్టంగా ఉందో మీ అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరూ స్పందించలేదు. ఎలాగోలా ఇంతవరకు లాక్కొచ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. 

(చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్‌ అయినా చెప్పాలిగా)

నేను చస్తే మనశ్శాంతిగా ఉంటుందా?
నా బిడ్డ కోసం బాధగా ఉంది. తను మాట్లాడలేదు. ఒక ఆర్టిస్టు బలవంతంగా విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా? ఎంతోమంది హీరోలతో కలిసి పని చేశాను. చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇలా పెద్దపెద్ద హీరోలతో చేశా.. ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను.

శక్తి లేదు
కానీ నా బిడ్డను చంపుకోలేకపోతున్నాను. ట్రీట్‌మెంట్‌ చేయించుకోలేక చాలా అవస్థ పడుతున్నాను. ఎవరికీ స్పందించే గుణం లేదా? ఇలా అనాథగా చంపేస్తారా? ఎవరి మనసులూ కరగవా? ఎవరికైనా నా దీన పరిస్థితి గురించి తెలుసా, తెలియదా? తెలియకపోతే దయచేసి ఈ వీడియో ద్వారా తెలియజేయమని కోరుకుంటున్నాను. నాకు ఇంక మాట్లాడే శక్తి లేదు' అంటూ సాయం చేయమని వేడుకుంటోంది.

సినిమా
పావలా శ్యామల.. కర్తవ్యం, అల్లరి రాముడు, మనసంతా నువ్వే, ఖడ్గం, ఇంద్ర, ఠాగూర్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, నిన్నే ఇష్టపడ్డాను, గోలీమార్‌, శ్రీమన్నారాయణ, డీ ఫర్‌ దోపిడి, మత్తు వదలరా.. ఇలా వందలాది చిత్రాల్లో నటించింది. తన విచిత్రమైన డైలాగ్‌ డెలివరీతో అందరినీ అలరించింది. ఎంతోమందికి వినోదాన్ని పంచిన ఆమె ఇప్పుడు చావు కోసం ఎదురుచూస్తుండటం శోచనీయం.

Shamala-emotional-videos

చదవండి: దుబాయ్‌ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)