Breaking News

రోడ్డు మీద దయనీయ స్థితిలో శ్యామల.. కాపాడిన పోలీసులు

Published on Wed, 12/10/2025 - 11:52

తెలుగు నటి పావలా శ్యామల పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా మారుతోంది. అటు ఆరోగ్య సమ్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో దినదినగండంగా బతుకు వెల్లదీస్తోంది. పైసా ఆదాయం లేకపోవడం.. దానికి తోడు ఆదుకునేవారే కరువు అవడంతో ఆమె జీవితమే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పలువురు సాయం చేసినా అది తాత్కాలిక ఉపశమనం కలిగించిందే తప్ప ఆమె బతుకు మాత్రం చక్కబడలేదు.

రోడ్డు మీదకు శ్యామల
గత కొంతకాలంగా శ్యామల.. మంచానికే పరిమితమైన కూతురితో కలిసి ఓ హోమ్‌లో నివసిస్తోంది. ఇటీవల ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో తాను కూడా కదల్లేని స్థితికి చేరుకుంది. దీంతో మంచానికే పరిమితమైన తల్లీకూతుర్లకు తాము సేవలు చేయలేమంటూ సదరు హోమ్‌ నిర్వాహకులు వారిద్దరినీ బయటకు పంపినట్లు తెలుస్తోంది. తమను ఆదుకునేవారు లేక నిరాశలో కూరుకుపోయిన శ్యామల.. దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఓ వార్త వైరలవుతోంది.

పోలీస్‌ సాయంతో..
రోడ్డుపై దయనీయ పరిస్థితిలో ఉన్న వారిని కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది గమనించి తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి తల్లీకూతుర్లిద్దరినీ ఆర్‌కే ఫౌండేషన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ (స్వచ్చంద సంస్థ)లో చేర్పించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామకృష్ణ.. శ్యామలతో పాటు ఆమె కూతురికి ఆశ్రయం కల్పించి అన్ని సేవలు అందిస్తామని ప్రకటించాడు.

ఆదుకోండి
పావల శ్యామల (Pavala Syamala) దాదాపు 300 సినిమాల్లో నటించింది. వెండితెరపై గయ్యాలి గంపగా, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను విషం తాగి చావడానికి సిద్ధమే కానీ కూతుర్ని చంపుకోలేకపోతున్నాననంది. చికిత్స చేయించుకునేందుకు డబ్బుల్లేవని, ఆదుకోమని ఎన్నోసార్లు మొర పెట్టుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలోనూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)