Breaking News

అలా చేసి ఉంటే సినిమా మరింత బాగుండేది: పరుచూరి గోపాలకృష‍్ణ

Published on Sat, 02/11/2023 - 16:33

పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' చిత్రంపై సమీక్షను వెల్లడించారు. అయితే ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసి ఉంటే మరింత బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుందని.. సెకండాఫ్‌లో కాస్త మార్చి ఉండాల్సిందన్నారు. 

18 పేజెస్ టైటిల్ విన్నప్పుడే నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూసే దాకా అవీ డైరీలోని పేజీలని ప్రేక్షకులకు తెలియదు. ఒక వ్యక్తికి తన కలల సుందరి కళ్ల ముందు కనపడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. ఏ ఫ్రెండ్‌ ఇన్‌ నీడ్‌ ఈజ్‌ ఏ ఫ్రెండ్‌ ఇన్‌ డీడ్‌ ‍అనే విషయాన్ని చక్కగా తెరపై చూపించారు దర్శకుడు సూర్యప్రతాప్‌. 

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన హీరో. అదే సమయంలో నందిని అనే అమ్మాయి డైరీ చదవడం.. చూడకుండానే ఆమెతో ప్రేమలో పడటం. చిన్న చిన్న ట్విస్టులతో ఫస్టాఫ్‌ తెరకెక్కించారు. ఫస్టాఫ్‌ అన్నందుకు క్షమించాలి. అందులో ప్రేమను చూపించి.. సెకండాఫ్  వచ్చేసరికి సామాజిక కోణాన్ని పరిచయం చేశారు. అయితే హీరో, హీరోయిన్స్‌ ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అనే సీన్స్‌ను కాస్తా అర్థమయ్యేలా చూపించి ఉంటే సినిమా బాగుండేది. ఈ విషయాన్ని దర్శకుడు సూర్యప్రతాప్‌తో చెప్పా. సమయం లేకపోవడం వల్ల కొన్ని సీన్స్‌ను తొలగించినట్లు చెప్పారు.'అని అన్నారు. 

Videos

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)