Breaking News

దమ్మున్న హీరోకే 'దేవర' సాధ్యం.. ఆ ఒక్కటి చేసుంటేనా..: పరుచూరి

Published on Wed, 11/13/2024 - 19:41

దేవరతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. కొరటాల శివ డైరెక్షన్‌ చేసిన ఈ సినిమాలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్‌ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేవర సినిమాపై రివ్యూ ఇచ్చారు.

దమ్మున్న హీరో
ఆయన తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. 'సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే! సంగీతం మరీ అంత గొప్పగా లేదు. డిఫరెంట్‌ టాక్‌ వచ్చినా కూడా సినిమా విజయవంతంగా ఆడాలంటే అక్కడ దమ్మున్న హీరో ఉండాలి. అలాంటివారిలో మా చిన్న రామయ్య (జూనియర్‌ ఎన్టీఆర్‌) ఒకడు. సముద్రపు దొంగ మంచివాడిగా ఎలా మారాడన్నదే కథ. 

కథ చిన్నదే..
ఇంత చిన్న పాయింట్‌పై ఆధారపడి మూడుగంటల నిడివితో సినిమా తీయడమనేది జోక్‌ కాదు. ఎక్కువ సన్నివేశాలు సముద్రానికి సంబంధించినవే ఉన్నాయి. ఈ విషయంలో కొరటాల శివ 'స్క్రీన్‌ప్లే మాస్టర్‌' అనిపించుకున్నాడు. ఈ కథ తారక్‌కు సెట్‌ కాదేమోననుకున్నా.. కానీ డైరెక్టర్‌.. ఎన్టీఆర్‌కు తగ్గట్లుగా మూవీ తీసి వసూళ్లు రాబట్టాడు. 

అలా చేసుంటేనా..!
ఇదే కథ హాలీవుడ్‌లో తీస్తే సూపర్‌ అంటారు. కథ గొప్పగా లేకపోయినా కథనం బాగుంటే సినిమాలు ఆడతాయనడానికి దేవర ప్రత్యక్ష ఉదాహరణ. ట్విస్టులు బాగున్నాయి. జాన్వీ కపూర్‌తో ఎన్టీఆర్‌కు రొమాంటిక్‌ సీన్లు, వినోదాత్మక సన్నివేశాలు పెట్టుంటే రూ.1000 కోట్లు ఈజీగా దాటేసేది. తారక్‌ నటన సహజంగా ఉంది' అని పేర్కొన్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)