Breaking News

అన్నయ్య మాట కోసం 100 ఎకరాలు పోగొట్టుకున్నా: పరుచూరి గోపాలకృష్ణ

Published on Wed, 04/12/2023 - 21:41

తెలుగు ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరావు.. వీరిద్దరూ 300కు పైగా సినిమాలకు రచయితలుగా పని చేశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం సైతం వహించారు. ఇద్దరూ సినిమాల్లోనూ నటించారు. అయితే పరుచూరి వెంకటేశ్వరావు వృద్దాప్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉండగా గోపాలకృష్ణ ఎప్పటికప్పుడు సినీవిశేషాలను పంచుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు.

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నా డైరెక్షన్‌లో శోభన్‌బాబుతో ఓ సినిమా తీశాను. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో కోర్టు సీనులో రామానాయుడుగారు ట్రాలీ తోసేవారు. ఏం డైలాగులు రాసావయ్యా అని మెచ్చుకునేవారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని సురేశ్‌బాబు ముందే అన్నారు. అన్నట్లే జరిగింది. మంచి విజయం సాధించింది. దీంతో దేవీప్రసాద్‌, త్రివిక్రమ్‌ రావు, అశ్వినీదత్‌.. అందరూ తమ బ్యానర్‌లో నెక్స్ట్‌ సినిమా చేయాలంటూ అడ్వాన్సులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కృష్ణ లేదా శోభన్‌బాబును హీరోగా పెట్టి సినిమా చేయమని డబ్బుల కట్టలు ముందు పెట్టి అడిగారు.

ఆరోజు కనక అడ్వాన్స్‌ తీసుకునుంటే శంకరపల్లిలో నాకు వంద ఎకరాల భూమి ఉండేది. అప్పుడు ఎకరం పదివేల రూపాయలు మాత్రమే! సురేశ్‌బాబు అప్పటికే పక్కనుంచి అంటున్నాడు. మీ అన్న వెంకటేశ్వరావును డబ్బు తీసుకోమనండి. నేను ఆల్‌రెడీ భూమి కొనుక్కున్నా. మీ అన్నదమ్ములిద్దరికీ చెరో 50 ఎకరాలు కొనిస్తానని చెప్పాడు. భవిష్యత్తులో అది మీకే పనికొస్తుందని సలహా ఇచ్చాడు. కానీ మా అన్నయ్య వద్దన్నాడు. వాడు డైరెక్టర్‌ అయితే నేను ఫిడేలు వాయించుకోవాలా? అన్నాడు. అన్నకు ఇష్టం లేనిది నేను చేయనని చెప్పాను. కానీ తర్వాత మాత్రం తను చాలా బాధపడ్డాడు' అని చెప్పుకొచ్చాడు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)