Breaking News

శివకార్తికేయన్‌కు కథ చెప్పిన పార్కింగ్‌ డైరెక్టర్‌!

Published on Wed, 01/07/2026 - 08:20

సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్‌ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్‌ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్‌ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్‌ సి పేరు ఖరారైంది. 

డాన్‌ దర్శకుడితో రజనీకాంత్‌
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్‌ చిత్రం ఫేమ్‌ రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్‌ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్‌ చిత్రం ఫేమ్‌ అశ్వద్‌ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్‌ చిత్రం ఫేమ్‌ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.

పార్కింగ్‌ డైరెక్టర్‌
ఇకపోతే పార్కింగ్‌ చిత్రం ఫేమ్‌ రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్‌కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్‌ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.

చదవండి: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో ఛాన్స్‌.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)