Breaking News

‘ది ప్యారడైజ్‌’కి పెట్టింది ఎంత? రావాల్సింది ఎంత?

Published on Wed, 09/23/2026 - 15:00

మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్‌ 24 రిలీజ్‌..23న ప్రీమియర్స్‌) ది ప్యారడైజ్‌ మూవీ థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత హైప్‌ ..మరే చిత్రానికి రాలేదు. ప్రమోషన్స్‌ కోసం వదిలిన ప్రతి కంటెంట్‌ సూపర్‌ హిట్‌ అయింది. అందుకే ఈ చిత్రానికి ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీగానే జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు అయిన ఖర్చు ఎంత? ఇప్పటివరకు వచ్చింది ఎంత?

నాని కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌.. 
సినిమా సినిమాకి బడ్జెట్‌ పెంచుకుంటూ పోతున్నాడు నాని. ‘దసరా’కి రూ.70 కోట్లకు పైగా ఖర్చు అయింది. అప్పటివరకు అదే అత్యధిక బడ్జెట్‌.. ఆ తర్వాత సరిపోదా శనివారం, హిట్‌ 3.. ఇలా వరుసగా బడ్జెట్‌ పెంచుకుంటూనే వస్తున్నాడు. ఇక ప్యారడైజ్‌కి అయితే ఆయన రేంజ్‌కి మించిన బడ్జెట్‌ పెట్టారు. ఈ సినిమాకు రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేశారట నిర్మాత సుధాకర్‌ చెరుకూరి. ముందుగా అనుకున్న బడ్జెట్‌కి మించి ఖర్చు చేశారట. అయినా కూడా నిర్మాత హ్యాపీగానే ఉన్నాడు. మీడియాతో మాట్లాడుతూ..వాయిదా పడినా.. ఖర్చు పెరిగినా ఏమాత్రం భయపడలేదని చెప్పాడు.

(ఇదీ చదవండి: '‍ప్యారడైజ్' సినిమా.. రెమ్యునరేషన్ ఎవరికెంత?)

నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ఎంతంటే..?
ఈ సినిమాకు ముందుగానే బిజినెస్‌ అయింది. నాన్‌  థ్రియేట్రికల్‌  రైట్స్‌  కింద మొత్తంగా రూ. 80-100 కోట్ల వరకు నిర్మాతకు వచ్చాయట. అందులో ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ నుంచే రూ. 50 కోట్ల వరకు ఉన్నాయట. నెట్‌ఫ్లిక్స్‌ ఈ భారీ మొత్తం చెల్లించి ఓటీటీ రైట్స్‌ దక్కించుకుంది. ఇక ఆడియో రైట్స్‌  కింద రూ. 15 కోట్ల వరకు వచ్చింది. ఈ మొత్తం ఒక్క ఆయా షేర్‌  పాట నుంచే సదరు ఆడియో కంపెనీకి వచ్చిందట. అలాగే ఓవర్సీస్‌లోనూ మంచి బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఆడియో, శాటిలైట్‌, ఓటీటీ..ఇలా మొత్తంగా రూ. 100 కోట్ల వరకు నిర్మాతకు వచ్చినట్లు తెలుస్తోంది.

థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రే ఈవెన్‌ టార్గెట్‌ ఎంత?
ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ నాని కెరీర్‌లోనే అత్యధికంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 75 కోట్లకు పైగా అమ్ముడవగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ. 100 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే భారీగానే వసూలు చేయాలి.  బయ్యర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే (బ్రేక్ ఈవెన్) సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు  షేర్ వసూలు చేయాలి. గ్రాస్ రూపంలో చెప్పాలంటే ఇది సుమారు రూ.200 కోట్లకు సమానం. సినిమాకు వచ్చిన బజ్‌ని బట్టి చూస్తే.. తొలి రోజు రూ. 60 కోట్లకు వరకు వసూలు చేసే అవకాశం ఉంది. హిట్‌ టాక్‌ వస్తే మాత్రం తొలి మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)