Breaking News

సౌత్‌ హీరోలు ఫేక్‌.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్‌ ఫోటోగ్రాఫర్‌

Published on Sat, 06/08/2024 - 16:28

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో హిందీ చిత్రపరిశ్రమపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. స్టార్‌ హీరోల సినిమాలను బహిష్కరించాలన్న డిమాండ్స్‌ కూడా తెరపైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణాది చిత్రాలు మంచి కంటెంట్‌తో వచ్చి క్లిక్‌ అవడంతో అందరి కళ్లు సౌత్‌పై పడ్డాయి. పాన్‌ ఇండియా లెవల్‌లో సౌత్‌ సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి.

సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌
దీంతో అప్పటినుంచి బాలీవుడ్‌ను సౌత్‌ ఇండస్ట్రీతో పోల్చడం మొదలుపెట్టారు. దక్షిణాది తారలు ఎంతో సింపుల్‌గా ఉంటారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని.. కానీ హిందీ హీరోలు ఎక్కువ పోజులు కొడతారని విమర్శించారు. అయితే సౌత్‌ స్టార్స్‌ బయటకు కనిపించేంత విధేయతగా మెసులుకోరని బాలీవుడ్‌ కెమెరామన్‌ (ఫోటోగ్రాఫర్‌) వీరేందర్‌ చావ్లా అంటున్నాడు. 

వీరేందర్‌ చావ్లా, ఫోటోగ్రాఫర్‌

వీరేందర్‌ చావ్లా, ఫోటోగ్రాఫర్‌

చెప్పులేసుకుని..
అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్‌ సెలబ్రిటీలు ఫేక్‌గా కనిపిస్తారు.  ఏదో పైకి మాత్రం ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. ఒక హీరో (విజయ్‌ దేవరకొండ) అయితే తన సినిమా ప్రమోషన్స్‌కు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్‌గా ఉన్నట్లు చూపించుకోవడానికే కెమెరా ముందు అలా యాక్ట్‌ చేశాడు. సౌత్‌లో మరో బిగ్‌ స్టార్‌ (జూనియర్‌ ఎన్టీఆర్‌) సాధారణంగా ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటాడు. 

ఫోటో తీసిందొకరైతే కోప్పడింది మాత్రం..
అతడు హోటల్‌కు వెళ్తుండగా ఓ ఫోటోగ్రాఫర్‌ ఆయన్ను క్లిక్‌మనిపించాడు. అందుకాయన నా టీమ్‌ మెంబర్‌పై కోప్పడ్డాడు. నిజానికి ఫోటో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది వేరే వ్యక్తి. కోప్పడింది మాత్రం మా వాళ్లపై! మహేశ్‌బాబు అయితే బాలీవుడ్‌ తనకు అవసరం లేదని చెప్పాడు. ఈయన ఇలా యాటిట్యూడ్‌ చూపిస్తున్నారేంటని అనుకున్నాను. అసలు ఫేక్‌గా ఉండేది సౌత్‌ హీరోలే.. బాలీవుడ్‌లో ఉన్నవాళ్లు లోపల, బయట ఒకేలా ఉంటారు' అని వీరేందర్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఎయిడ్స్‌ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)