Breaking News

కంటతడి పెట్టించే ‘పాపా’

Published on Wed, 06/18/2025 - 16:21

కవిన్, అపర్ణాదాస్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డాడా’. గణేశ్‌ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది.  ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం కథ విషయానికొస్తే.. పెళ్ళికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న విచిత్ర మలుపుల సమహారమే ఈ చిత్రం.  

మణి (కవిన్), సింధు (అపర్ణ దాస్) ఇద్దరు ప్రేమించుకుంటారు. కాలేజీ టైంలోనే సింధు గర్భం దాల్చుతుంది. ఈ విషయం ఇద్దరి కుటుంబాలలో తెలిసి.. ఇద్దరిని బయటకు వెళ్లగొడతారు. బయటకు వచ్చి ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు చదువుతూనే వైవాహిక జీవితాన్ని ఎలా కొనసాగించారు? ఈ క్రమంలో వారిద్దరికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరి వరకు ఈ జంట కలిసే ఉందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  వయసులో ఉండే ఆకర్షణలు, ఆవేశాలు, అపార్ధాలు, తరాల మధ్య అంతరాలు, వ్యక్తుల మధ్య ఉండే ఇగోలు, ఫ్రెండ్ షిప్, హెల్పింగ్ నేచర్, ముఖ్యంగా బంధాలు, భావోద్వేగాల కలబోతగా "పాపా" చిత్రాన్ని దర్శకుడు గణేష్ బాబు ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. కథగా చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా... కథనాన్ని రక్తి కటించిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

భాగ్యరాజా, విటివి గణేష్ తప్ప మిగతా పాత్రలు పోషించినవారు మనకు తెలియనివారే అయినప్పటికీ... ప్రేక్షకులు ఆయా పాత్రలతో ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. . హీరోయిన్ అపర్ణాదాస్...  కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం.

హీరోగా నటించిన కవిన్, హీరోయిన్ పాత్ర పోషించిన అపర్ణాదాస్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు. వీళ్ళ అబ్బాయిగా చేసిన మాస్టర్ ఇయాన్ తోనూ మనం ప్రేమలో పడిపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. 

హీరోయిన్ అపర్ణాదాస్...  కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం. ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను ఇంకొంచెం క్యాష్ చేసుకునెలా రెండుమూడు సీన్స్ కన్సీవ్ చేసుకుని ఉంటే ఎమోషన్ మరింత పండేదనిపిస్తుంది  

"సింగిల్ పేరెంటింగ్"లో ఉండే పెయిన్, తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ కు ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కూడా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అయితే... మనసు తడిని వెలికి తీసే క్లైమాక్స్... ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ కు తావు లేకుండా చేస్తుంది.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు